ఆగస్టు 18న శ్రీవారి కల్యాణోత్సవం రద్దు

by srinivas |   ( Updated:2024-08-12 14:48:12.0  )
ఆగస్టు 18న శ్రీవారి కల్యాణోత్సవం రద్దు
X

దిశ ఏపీ బ్యూరో, అమరావతి: తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 18వ తేదీన శ్రీవారి కల్యాణోత్సవమును టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేదీ రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టిటిడి కోరింది.

Advertisement

Next Story