భక్తులకు టీటీడీ కర్రలు ఇవ్వడంపై ట్రోల్స్: చైర్మన్ భూమన రిప్లై

by Seetharam |   ( Updated:2023-08-17 07:10:05.0  )
భక్తులకు టీటీడీ కర్రలు ఇవ్వడంపై ట్రోల్స్: చైర్మన్ భూమన రిప్లై
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమలలో చిరుతల నుంచి తప్పించుకునేందుకు భక్తులకు కర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని ఘాటుగా నెటిజన్లు ఆడుకుంటున్నారు. అంతేకాదు చిరుతతో పోరాడాలంటే కర్రలు ఉంటే చాలని తెలియక ఆర్ఆర్ఆర్ సినిమాలో చాలా సాహసమే చేశానంటూ ఎన్టీఆర్ అన్నట్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఫోటోలతో కర్రలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ ట్రోలింగ్‌పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. నడకమార్గంలో భక్తులకు కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదన్నారు.

ఈ ట్రోల్స్‌ను ఖండిస్తున్నట్టు తెలిపారు. అటవీశాఖ అధికారుల సూచనతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. కర్రలు ఇచ్చినంత మాత్రాన ఆపరేషన్ చిరుతను ఆపడం లేదని అది కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. చిరుతలను అన్నింటిని పట్టుకుని జూకు తరలిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తెల్లవారు జామున చిరుత బోనులో చిక్కిందని తెలిపారు. బోనులో చిక్కిన మగ చిరుత వయసు ఐదేళ్లు ఉంటాయని తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తల భద్రతకు టీటీడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed