విశ్వన్నకు మద్దతుగా గిరిజనులు ఇంటింటి ప్రచారం..

by Jakkula Mamatha |
విశ్వన్నకు మద్దతుగా గిరిజనులు ఇంటింటి ప్రచారం..
X

దిశ, ఉరవకొండ: కూడేరు మండలం మరుట్ల తండా లో వైఎస్సార్సీపీ గిరిజన విభాగం నాయకులు విశ్వన్నకు మద్దతుగా విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం గిరిజన నాయకులు చత్రే నాయక్ , హనుమంతు నాయక్, సుంకే నాయక్, ప్రసాద్ నాయక్ నాగరాజు నాయక్, చంద్ర నాయక్ తదితరులు ఆ గ్రామంలో పర్యటించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో వైఎస్సార్సీపీ ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని తాము కోరుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story