- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విశాఖలో పట్టాలు తప్పిన రైలు
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రైలు పట్టాలు తప్పింది. నిత్యం రైళ్ల రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో రైలు పట్టాలు తప్పడంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.. జంబో గూడ్స్ రైలు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి కిరాండోల్ కు బయలుదేరింది. కాగా జంబో గూడ్స్ రైలు మార్గం మధ్యలో అల్లూరి జిల్లా అరకులోయ లోని చిమిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది.
అయితే ఆ సమయంలో విశాఖ నుంచి కిరాండోల్ కు పాసింజర్ రైలు వస్తున్నది. ఇంతలో ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విశాఖ నుంచి కిరాండోల్ కు వస్తున్న పాసింజర్ రైలును కొత్తవలస వద్ద నిలిపివేశారు. అనంతరం హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే పట్టాలు తప్పిన రైలు గూడ్స్ రైలు కావడం, రైలు పట్టాలు తప్పిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై ఆ మార్గంలో ఏ ఇతర రైళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.