నేడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల..

by Indraja |
నేడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల..
X

దిశ వెబ్ డెస్క్: కాంగ్రెస్ గూటికి చేరిన వైఎస్ షర్మిలకు అధిష్టానం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్న ఆమె.. ఈ రోజు ప్రత్యక విమానంలో ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కాగా భద్యతల స్వీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల భాద్యతలను తీసుకోనున్నారు.

భద్యతల స్వీకరణ కార్యక్రమం ముగిసిన తరువాత వైఎస్ షర్మిల బెజవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ను ముందుకు నడిపిన కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు వైఎస్ షర్మిల వెంట అడుగులేస్తున్నారు. కాగా వసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల అనంతరం మీడియాతో మాట్లాడుతూ. .తండ్రి ఆశయాల సాధన కోసం తాను కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.. అలానే రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు తన పోరాటం ఆగదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed