- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tirumala: భారీగా శ్రీవారి హుండీ ఆదాయం.. ఎంతంటే..!

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి(Tirumala Srinivaru) గురువారం భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ. 3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD Officers) వెల్లడించారు. ఇక తిరుమలేశ్వరుడి(Tiruamaleswarudu)ని భక్తులు భారీగానే దర్శించుకున్నారు. వెంకన్న సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని భక్తులు అంటున్నారు. ఎనిమిది కంపార్టుమెంట్లలో భక్తులు బారులు తీరినట్లు చెబుతున్నారు. గురువారం ఒక్క రోజే 58, 627 మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎండల తీవ్ర దృష్ట్యా భక్తులకు తిరుమలలో అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేసవి నేపథ్యంలో తిరుమలలో పలు చోట్ల చలువ పందిళ్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తులకు మంచినీళ్లు, అల్ఫాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. కాలి నడక భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుత సంచారం దృష్ట్యా ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల సమచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్లలో పొందుపర్చుతున్నామని, ఈ మేరకు భక్తులు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో రెండు, మూడు రోజులు పాటు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.