- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో వైసీపీ(YCP), టీడీపీ(TDP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా రెండు వీడియోలను షేర్ చేస్తూ ఈ ఘటన పై స్పందించారు. ఒక వీడియోలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని, నెయ్యిలో వనస్పతి(Margarine in ghee) వంటి వెజిటబుల్ ఫ్యాట్స్(Vegetable fats) ఉన్నట్లు వెల్లడైందని వివరించారు.
దీంతో ఆ నెయ్యి సరఫరాదారును బ్లాక్ లిస్ట్‌లో ఉంచామని తెలిపారు. ఈ క్రమంలో రెండు ట్యాంకర్ల నెయ్యిని తిప్పి పంపామని వెల్లడించారు. అయితే ఈవో జె.శ్యామలరావు ఈ వ్యాఖ్యలు చేసింది జులై 23వ తేదీగా చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సెప్టెంబర్ 18న చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో ఉంది. దీనిపై జగన్ స్పందిస్తూ.. దీనర్థం ఏమిటి చంద్రబాబు? అని ప్రశ్నించారు. దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.