తిరుమలలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే

by Seetharam |
తిరుమలలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తిరుమలలో సందడి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి తిరుమల చేరుకున్నారు. దీపికా పదుకునే దాదాపు మూడున్నర గంటలపాటు నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. అయితే దీపిక వెంట ఆమె సిబ్బంది సైతం ఉన్నారు. దీపికా పదుకునేను చూసేందుకు.. ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు పోటెత్తారు. సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. అయితే సిబ్బంది వారిని వారించడంతో ఆమె వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్నారు. రాత్రికి దీపికా పదుకునే అక్కడ బస చేసి శుక్రవారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇకపోతే దీపికా పదుకొనె ఈ ఏడాది రెండు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన పఠాన్, జవాన్ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్‌ అయ్యాయి. ప్రస్తుతం దీపికా పదుకునే మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఏడీ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమాలోనూ దీపికా పదుకునే నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story