- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంచుకొస్తున్న తుపాను ముప్పు: రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్
దిశ , డైనమిక్ బ్యూరో : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 4నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమకు ఈ తుపాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నవంబరు 30 నాటికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం డిసెంబరు 2 కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ వివరించింది. డిసెంబర్ 4న తుపానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 3న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో డిసెంబరు 2 నుంచి 4 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబరు 30 కల్లా తిరిగొచ్చేయాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.