ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-01-25 12:07:46.0  )
ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హులగా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. అధికార పార్టీలో ఉండాలనే కాంక్షతో టీడీపీలో గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని ఇది వరకే పార్టీ విప్‌ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్‌ వేశారు. ఆయన ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ తమ్మినేని సీతారం టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయం కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని బాబు స్పీకర్‌కు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed