ప్రస్తుతం రాజకీయ పార్టీలు నమ్ముతున్న సక్సెస్ ఫార్ములా ఇదే

by Indraja |
ప్రస్తుతం రాజకీయ పార్టీలు నమ్ముతున్న సక్సెస్ ఫార్ములా ఇదే
X

దిశ వెబ్ డెస్క్: మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో తెలీదుగానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికల్లో విజయపతాకం ఎగరవేసేందుకు ఓ మంత్రాన్ని జపిస్తున్నారు. ఆ మంత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయభేరిని మోగించేలా చేసింది. ఆ మంత్రమే గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం లోకి రావడానికి గల విజయ రహస్యం ఇదే.. గెలుస్తున్నాం అన్న భావనే జనాలను ఆకట్టుకుంటోందని.. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే మంత్రాన్ని ఉపయోగించి విజయ పతాకాన్ని ఎగరేసిందని ప్రతి పార్టీ నమ్ముతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో జరుగనున్న ఎన్నికల్లోనూ ఇదే ఫీల్ గుడ్ మంత్రాన్ని అన్ని పార్టీల నేతలు ఫాలో కానున్నారు.

ఫీల్ ఫ్యాక్టర్ ముఖ్య ఉద్దేశం గెలుస్తున్నాం, గెలిచేస్తున్నాం అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే. ఈ సిద్ధాంతాన్నే ప్రస్తుతం రాజకీయ పక్షాలు నమ్ముతున్నాయి. ఇలా చేయగలిగితే మిగతా అంశాలన్నీ ఒక్కొక్కటిగా సానుకూలంగా మారుతాయని విశ్వసిస్తున్నారు. ఇది తెలంగాణ విషయంలో రుజువైంది. ఎప్పుడైతే ఒక పార్టీ గెలుస్తుందని జనంలోకి బాగా వెళ్తుందో.. ఆటోమేటిక్ గా మిగతా అంశాలు అనుకూలంగా మారుతున్నాయి. పార్టీలో చేరికలు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు, నిధుల సమీకరణ, అధికార యంత్రాంగం మద్దతు.. ఇలా అన్ని వనరులు సమీకరించుకోవడం, సేకరించుకోవడం తేలిక అవుతుంది. అలానే ఏ పార్టీకి ఓటు వెయ్యాలో తెలీక కన్ఫ్యూషన్ లో ఉండేవారికి కూడా ఈ ఫీల్ గుడ్ ఓ స్పష్టతను ఇస్తుంది. దీనితో ఏ పార్టీని ఎన్నుకోవాలో తెలీక అయోమయం లో ఉండే ఓటర్లు గెలుస్తుంది అనే పార్టీకె ఓటు వేస్తారు.

Advertisement

Next Story

Most Viewed