అంతరాష్ట్ర సరిహద్దు సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ..కారణం ఇదే!

by Disha Web Desk 18 |
అంతరాష్ట్ర సరిహద్దు సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ..కారణం ఇదే!
X

దిశ,ఏలూరు:సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులు నుంచి అటు, ఇటు గంజాయి, మద్యం, నాటు సారా అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి సూచించారు.ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పోలీస్‌ అధికారులతో సరిహద్దు (బోర్డర్‌) సమావేశాన్ని ఆమె గురువారం ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. తెలంగాణకు సంబంధించి ఖమ్మం కమిషనరేట్‌ పోలీస్‌ కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఆంధ్ర తెలంగాణ రాష్ట్రల సరిహద్దు ప్రాంతాల లోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల చెక్ పోస్ట్ లు వద్ద రేయింబవళ్లు తనిఖీలు చేయాలన్నారు. అలాగే ఈ తనిఖీలు నిర్వహించే విషయంలో ఉభయ రాష్ట్రాల అధికారులు సమాచార మార్పిడి చేసుకునేందుకు ఒకరికి ఒకరు సహకరించుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed