- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీవీ ‘రాముడు’.. పోటీ మీరట్‌లో.. మకాం ముంబైలో.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : ‘రామాయణం’ సీరియల్‌లో శ్రీరాముడి పాత్రలో నటించి యావత్ దేశ ప్రజల మదిని దోచిన నటుడు అరుణ్ గోవిల్. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. అయితే మరుసటి రోజు నుంచి అరుణ్ గోవిల్ స్థానికంగా కనిపించలేదు. దీంతో ‘‘పోలింగ్ జరిగాక అరుణ్ గోవిల్ బిచాణా ఎత్తేశారు. ఆయన పారచూట్ రాజకీయం చేస్తున్నారు. బీజేపీ నాయకులకు ఓట్లపైనే ఆసక్తి తప్ప.. ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ధ్యాసే ఉండదు’’ అంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ట్వీట్ చేశారు.
पता चल रहा है कि मेरठ से भाजपा प्रत्याशी रहे अरुण गोविल जी चुनाव निपटने के अगले ही दिन मुंबई निकल गए। शायद इन्हें जनता के बीच रहने में दिक्कत थी।
— Ajay Rai🇮🇳 (@kashikirai) April 27, 2024
ये जनाब कल पोलिंग बूथ के अंदर वीडियोग्राफी करा रहे थे। इनके चुनाव प्रचार में एक व्यापारी की जेब से 36000 रुपये उड़ा लिए गए।
इतना ही… pic.twitter.com/ZoEoa3yta4
దీనిపై స్పందించిన అరుణ్ గోవిల్.. తాను మీరట్‌లో అందుబాటులో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. మీరట్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు తాను ముంబైకి చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో తన సేవలను పార్టీ వినియోగించుకోనుందని చెప్పారు. ‘‘గత నెల రోజులుగా నాతో పాటు మీరట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు. వారిని నేను మరువను. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నాను. ఎన్నికల్లో గెలిచాక అందరం కలిసి మీరట్‌ను డెవలప్ చేద్దాం’’ అని అరుణ్ గోవిల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
मेरे मेरठ के सम्मानित मतदाता बहनों- भाइयों और कार्यकर्ताओं
— Arun Govil (@arungovil12) April 28, 2024
नमस्कार 🙏🏼
होली के दिन 24 मार्च को भारतीय जनता पार्टी ने मेरे नाम की घोषणा की और उनके निर्देश पर 26 मार्च को मैं आपके बीच पहुँच गया। 1 महीना आपके साथ रहकर आपके सहयोग से चुनाव प्रचार किया। चुनाव संपन्न हुआ।
आपके… pic.twitter.com/GuGyF8Pa3Y