- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics:ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమికే ఓటు-కూటమి అభ్యర్థి
దిశ ప్రతినిధి,శ్రీకాకుళం: యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, సాగునీరు, త్రాగు నీరు ప్రతి గ్రామానికి అందాలి అన్న ఎన్డీఏ కూటమి గెలవాలని ఎచ్చెర్ల నియోజకవర్గం కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వర రావు పేర్కొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సిగడాం మండలంలో సీతంపేట గ్రామంలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని అన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేసిందని చెప్పారు. వలంటీర్ల పోస్టులనే ఉద్యోగాలని భ్రమ పెడుతుందని విమర్శించారు. గ్రామం ప్రతి వీధి తిరిగి మీ యొక్క అమూల్యమైన ఓటును కమలం గుర్తు పై వేసి ఎమ్మెల్యేని, సైకిల్ గుర్తుపై వేసి ఎంపీని గెలిపించాలని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.