- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:‘నారా దేవాన్ష్‌కు ఆరుగురితో సెక్యూరిటీ’..వైసీపీ నేత వ్యాఖ్యలపై పోలీసు శాఖ స్పందన ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ భద్రత అంశం సంచలనంగా మారింది. వైఎస్ జగన్‌కు హై సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న(బుధవారం) వైసీపీ నేత అంబటి రాంబాబు భద్రత అంశంపై మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్‌కు భద్రత పెంచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాణహాని ఉన్న జగన్‌కు భద్రత తగ్గించారని, సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌కు ఆరుగురితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్న జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ శాఖ తాజాగా స్పందించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం-2023 ప్రకారం ముఖ్యమంత్రితో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని చెబుతోందని ఏపీ పోలీస్ శాఖ వివరించింది. SSG-2023 చట్టం ప్రకారం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా SSG భద్రతకు అర్హులైన ప్పటికీ, వారు SSG నుంచి కానీ, ISW నుంచి కానీ ఎలాంటి భద్రతను వినియోగించుకోవడం లేదని స్పష్టం చేసింది. నారా దేవాన్ష్ విషయంలోనూ ఇదే జరుగుతోందని, దేవాన్ష్ రాష్ట్ర భద్రతను వినియోగించుకోవడం లేదని ఏపీ పోలీస్ శాఖ తేల్చి చెప్పింది.