టార్గెట్ చేస్తారు.. అయినా భయపడేది లేదు.. కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

by Rajesh |
టార్గెట్ చేస్తారు.. అయినా భయపడేది లేదు.. కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తనను, మాజీ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తారని అయినా భయపడేది లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం తాడేపల్లిలో జగన్ నేతృత్వంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరన్నారు. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారన్నారు. రుషికొండలోని భవనాలను జగన్ నివాసాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ ప్రభుత్వ భవనాల్లో ఉండలేదని గుర్తు చేశారు. సూపర్ సిక్స్ ను డైవర్ట్ చేసేందుకు రుషికొండ భవనాలను తెరపైకి తెచ్చారన్నారు. టూరిజం శాఖ నిర్మించిన ఏడు బ్లాక్ లను జగన్ నివాసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed