Kadapa: పులివెందులలో ఎన్నికలు.. ఉద్రిక్తత

by srinivas |
Kadapa: పులివెందులలో ఎన్నికలు.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: పులివెందులలో నీటి సంఘాల ఎన్నికల నామినేషన్ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేముల, పులివెందుల, తొండూరు మండలాల్లో ఈ ఉదయం నుంచి ఎమ్మార్వో కార్యాలయాల వద్ద నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీకి సంబంధించిన సానుభూతిపరులు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి రెండు వర్గాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను టీడీపీ సానుభూతి పరులు చించివేశారు. అయితే ఇదే సందర్భంలో నీటి బిల్లలు కట్టించుకోవడంలేదని వేముల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతు తెలుపుతూ వైసీపీ ఎంపీ అవనాశ్ రెడ్డి నిరసన చేపట్టేందుకు వేముల ఎమ్మార్వో కార్యాలయం వద్దకు వెళ్లేందుకు యత్నించారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. వేముల ఎమ్మార్వో ఆఫీసు వద్ద నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా చేరుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తల దృష్టా అక్కడికి వెళ్లకుండా అవినాశ్ రెడ్డి అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed