- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి నిరాకరించడంతో 11 మందిపై దాడి..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ పేరుతో జరిగే దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమించలేదని ఒకరు, ప్రేమించి పెళ్లికి నిరాకరించిందని మరొకరు.. ఇలా ఎన్నో కారణాలతో దాడులు చేసి కిరాతకులు గా మారుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి యువతి కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డాడు. ప్రేమోన్మాది దాడిలో యువతి కుటుంబ సభ్యులు 11 మంది గాయపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ బాలిక తనకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పింది. ఓ రోజు బాలికకు వివాహం నిశ్చయమైంది. దీంతో కోపగ్రస్తుడైన మణికంఠ ఇరు కుటుంబాలు మాట్లాడుకుని సమస్యని పరిష్కరిస్తే బాగుంటుందని బాలిక కుటుంబ సభ్యులను పిలిపించాడు. అనంతరం ఈ విషయంలో వారి మధ్య మాట మాట పెరిగి గొడవ తలెత్తింది.
దీంతో మణికంఠ, అతని బంధువులు కలిసి.. బాలిక, ఆమె కుటుంబ సభ్యులు 11 మంది పై దాడి చేశారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మరో 9 మందిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గుంటూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
- Tags
- Crime News Today