- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Elections 2024: రానున్న ఎన్నికల్లో గెలుపు నాదే.. వైసీపీ అభ్యర్థి
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో అన్నే పార్టీలు గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరూ గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. తాజాగా చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో గెలుపొందబోయే అబిభ్యర్థి తానేనని ధీమా వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధి, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, అలానే స్థానిక ప్రజలకు తమ కుటుంబం చేసిన వ్యక్తిగత సేవ ఇవన్నీ కూడా జనాల్లో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక గత ఐదేళ్లుగా తమకు ఉన్న సమయంలో 90% సమయం ప్రజల్లోనే గడిపినట్లు వెల్లడించారు. ఇక కరోనా సమయంలోనూ ప్రజలకు మేలు జరిగేలా.. కుటుంబం కుటుంబం లబ్ధిపొందేలా కృషి చేశామన్నారు.
ఇక వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఒక్కో పంచాయితీకి ఇప్పటివరకు ఆరు నుండి ఏడు సార్లు తిరగడం జరిగిందని తెలిపారు. ఇక గత ఐదేళ్లుగా తానే వ్యక్తిగతంగా పలుమార్లు ఊరూరూ తిరగడం జరిగిందని.. ఈ నేపథ్యంలో ఎన్ని సార్లు మీరు రావాల్సిన అవసరం లేదని.. తప్పకుండా మిమ్మల్నే గెలిపిస్తామని ప్రజలే తమకు ధైర్యం చెప్పారని హర్షం వ్యక్తం చేశారు.