- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలే కొడాలి నాని ని చంపేస్తారు: టీడీపీ నేత బుద్దా
దిశ, ఏపీ బ్యూరో : క్యాసినో వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారని టీడీపీ ఆరోపిస్తుంటే... అలాంటిదేమీ లేదని మంత్రి కొడాలి నాని తెగేసి చెబుతున్నారు. అంతేకాదు తన కన్వెన్షన్ సెంటర్‌కు టీడీపీ నేతలు వస్తే చూస్తూ ఊరుకోనని గట్టిగా హెచ్చరిస్తున్నారు. తన కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు దురుద్దేశంతో ఆరోపిస్తున్నారని.. తనకు అవకాశం ఇస్తే చంద్రబాబు నివాసంలో వ్యభిచారం జరుగుతుందని.. దాన్ని బట్టబయలు చేస్తానని ఎదురుదాడికి దిగుతున్నారు.
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటికి కాదు కదా గేటు తాకినా కొడాలి నాని శవాన్ని వెనక్కి పంపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. నువ్వేమైనా పెద్ద రౌడీ అనుకుంటున్నావా.. ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నావా అంటూ బుద్ధా వెంకన్న మంత్రి కొడాలి నానిని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు టీడీపీ నేతల పై మాట్లాడుతున్నారని.. నువ్వెంత నీ కెపాసిటీ ఎంత అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
అరగంటలో ప్రజలే చంపేస్తారు
కొడాలి కి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనని గుర్తు చేశారు. కొడాలి నాని ద్రోహి అని.. అలాంటి ద్రోహులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అర గంటలో ప్రజలు మంత్రి కొడాలి నానిని చంపేస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా, ఒంటరిగా రావాలని బుద్ధా వెంకన్న మంత్రి కొడాలి నానికి సవాల్ విసిరారు. వాడు, వీడు అంటూ మాట్లాడుతున్న కొడాలి నానికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని.. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నాని పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. వైసీపీ గూండాలు, రౌడీలు రోడ్లపైకి వచ్చి అరాచకాలు, రౌడీయిజం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
నిజనిర్ధారణ కమిటీ ప్రతినిధులను అరెస్ట్ చేసిన పోలీసులు.. క్యాసినో ఆడించిన, ఆడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని.. చంద్రబాబు పై నోరు పారేసుకుంటే తామూ చూస్తూ ఊరుకోబోమని గట్టిగా హెచ్చరించారు. కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలతో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఓర్పు, సహనం నశించిపోయిందని భవిష్యత్‌లో తమ ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని గట్టిగా చెప్పారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కొడాలి నాని తగిన మూల్యాన్ని చెల్లంచుకునే పరిస్థితిని తీసుకువస్తామని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం
మంత్రి కొడాలి నానికి సంబంధించిన కే కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో ఆడించింది వాస్తవం అయినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం శోచనీయమని బుద్దా వెంకన్న అన్నారు. రూ. 200 కోట్లు క్యాసినో పేరుతో మంత్రి కొడాలి నాని దోచుకున్నారంటూ ధ్వజమెత్తారు. కే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అరాచకాలపై తెలుసుకునేందుకు వెళ్లిన తమ పార్టీ నిజనిర్దారణ కమిటీ సభ్యుల పై కొడాలి నాని గూండాలు దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసు యంత్రాంగం పని చేస్తోందని బుద్దా వెంకన్న ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు.