- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారా లోకేష్ నిజంగా US పోలీసుల ఆధీనంలో ఉన్నారా..? ఇందులో వాస్తవమెంత ?
దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం అమెరికా పోలీసుల ఆధీనం లో ఉన్నారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ వార్త గురించి మొదటగా వాట్సాప్ లో జోరుగా ప్రచారం సాగింది. ఆ తరువాత అతి కొద్ది సమయంలోనే సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని వేదికల్లో ఈ వార్త ప్రబలుతోంది.
కాగా జనవరి 23 వ తేదీన లోకేష్ పుట్టిన రోజు.. ఆ రోజు కూడా లోకేష్ తన భార్యతో లేరు అనే హ్యాష్‌ట్యాగ్ తో లోకేష్ అమెరికాలో జైలుకు వెళ్లారు అని తెలిపేలా ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో వస్తున్న వార్తకు మరింత బలం చేకూరింది. అయితే లోకేష్ అమెరికాకు నిజంగా వెళ్ళారా..? అక్కడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసారా..? అసలు సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా..? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లోకేష్ అమెరికా వెళ్లిన మాట వాస్తవం. అయితే అక్కడ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసారని.. ప్రస్తుతం లోకేష్ పోలీసుల ఆధీనంలో ఉన్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ అవసరాలకు కావాల్సిన నిధులను NRI ల నుండి సేకరించి తీసుకు రావడానికి లోకేష్ అమెరికా వెళ్లారు. అయితే అక్కడ ఆయన్ని ఏ పోలీసులు అరెస్ట్ చెయ్యలేదు అని కొన్ని రిపోర్టుల ఆధారంగా వస్తున్న సమాచారం. ఇక తాజాగా ఈ విషయం పైన టీడీపీ కూడా x వేదికగా స్పందించింది.
రెండు కోట్ల వాచ్ ఇచ్చినా జడ్జి గారు విసిరికొట్టారు అన్న అసహనం ఒకవైపు, ఓడిపోతున్నాను అనే బాధ మరొక వైపు.. ఈ రెండు జగన్ ని కుదిపేస్తున్నట్టు ఉన్నాయి.. ఏం చెయ్యాలో తెలియక, జనాలకు మొహం ఎలా చూపించాలో అర్ధం కాక పొంతన లేని ఫేక్ వార్తలు రాయిస్తున్నాడు జగన్ అని x లో చేసిన పోస్ట్ లో టీడీపీ పేర్కొంది. అలానే లోకేష్ అరెస్ట్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియా లో తప్ప ఏ న్యూస్ ఛానల్ లోనూ టెలికాస్ట్ కాలేదు.
లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయిన మాట వాస్తవమే అయితే కనీసం ఇంటర్నేషనల్ మీడియా లో అయిన ఈ అరెస్ట్ కి సంబంధించిన వార్తలు వచ్చి ఉండాలి.. కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు రాలేదు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని చూస్తే లోకేష్ అరెస్ట్ అయ్యారు అనే వార్తలో వాస్తవం లేదని తెలుస్తోంది.
Read More: వాళ్లకు నివాళులు.. అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుంది..నారా లోకేష్