- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గౌడ స్మశాన వాటిక ప్రహరీ గోడ ముఖద్వారం కూల్చివేసిన దుండగులు
దిశ,నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో శాంతి టాకీస్ వెనకాల సర్వే నెంబర్ 487-A నందు 1.80 ఎకరాలలో గౌడ స్మశాన వాటిక కలదు. గత 40 సంవత్సరాల నుండి గౌడ కులస్తులు ఈ స్మశాన వాటికనే వాడుతున్నారు. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఊర్లో ఉన్న స్థలాలు సరి పోలేదన్నట్లు ఏకంగా స్మశాన వాటికలను కూడా కబ్జా చేస్తున్నారు. కొంతమంది గుర్తు తెలియని దుండగులు గౌడ స్మశాన వాటిక ముఖ ద్వారమును ప్రహరీ గోడను కూల్చి వేసి కబ్జాకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జై గౌడ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జువ్వాజీ చంద్ర శేఖర్ గౌడ్, జై గౌడ సేన నంద్యాల జిల్లా అధ్యక్షులు పిట్ట ఎల్లగౌడ్ జై గౌడ సేన కర్నూలు జిల్లా అధ్యక్షులు సూర్య నారాయణ గౌడ్, సిద్దు గౌడ్ , శ్రీనివాసులు గౌడ్ లు స్మశాన వాటిక వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించి నందికొట్కూరు పట్టణం సి. ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ని ఆదివారం కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారని గౌడ సంఘం నాయకులు తెలిపారు.