టీడీపీ తొలి జాబితాలో వారికే దక్కిన చోటు?

by Jakkula Mamatha |   ( Updated:2024-02-24 09:40:32.0  )
టీడీపీ తొలి జాబితాలో వారికే దక్కిన చోటు?
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: టీడీపీ తొలి జాబితాలో నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మహిళా నాయకురాలు వంగలపూడి అనిత చోటు దక్కించుకున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీటు ముందే ఊహించినట్టు ఖరారయ్యింది. అయితే జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గం కాకుండా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో అయ్యన్న అభ్యర్థిత్వం ఒక్కటే ఖరారు కావడం విశేషం. అనకాపల్లి ఎంపీగా అయ్యన్న తనయుడు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి టీడీపీకి కేటాయించిన పక్షంలో నర్సీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇంకా ఎంపీ విషయం ఖరారు కాకుండానే నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుణ్ని ప్రకటించారు. ఈ క్రమంలో ఇక విజయ్ కు అవకాశం లేనట్లు కనిపిస్తుంది. ఇక పాయకరావుపేట విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జ్ అనిత ను గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చిన పార్టీ పాయకరావుపేట ఇన్చార్జి ప్రకటించారు.దీంతో ఆమె గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తూ, రాష్ట్ర స్థాయిలో మహిళా సమస్యలపై పోరాటం చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే పొత్తులో భాగంగా ఒకవేళ జనసేన కు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చివరకు అనిత నే ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

ఇక అనకాపల్లి విషయానికొస్తే అనుకోని విధంగా కొణతాల రామకృష్ణ తెరపైకి వచ్చారు. ఇంతవరకు ఇక్కడ ఇన్చార్జీగా పనిచేసిన పరుచూరి భాస్కరరావు పక్కన పెట్టి, కొణతాల ఖరారు చేయడం విశేషం. మాజీ మంత్రి కొణతాల ఇటీవల కాలంలో జనసేనలో చేరారు. తొలుత ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. లేదు పార్టీకి పనిచేస్తారనే మరో ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటినీ కాదని కొణతాలకు అనకాపల్లి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ తొలి జాబితాలో అరకును ప్రకటించారు.ఇటీవల చంద్రబాబు అరకులో ఏర్పాటు చేసిన రండి కదలిరండి సభలో దొన్నుదొర అరకు అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం దానికి ఖరారు చేస్తూ తొలి జాబితాలో తనకు అవకాశం ఇచ్చారు.

Read More..

పవన్.. TDP ఉపాధ్యక్ష పదవి తీసుకో: జనసేనానిపై సజ్జల సెటైర్లు

Advertisement

Next Story

Most Viewed