దెందులూరు ప్రజలేమీ అమాయకులు కాదు.. చింతమనేని ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
దెందులూరు ప్రజలేమీ అమాయకులు కాదు.. చింతమనేని ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దెందులూరులో తన చెమట, రక్తం ఉన్నాయని, వాటిని అన్నింటిని ధార బోసి ఇక్కడ రాజకీయం చేస్తున్నానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబ్బుంది కదా.. అని ఎవడుపడితే వాడు.. బ్యాగులేసుకుని దెందులూరుకు వస్తే తన వెంట్రుక కూడా పీకలేరు ఫైర్ అయ్యారు. ప్రజల కోసం పని చేసేవాడే నాయకుడు అవుతాడని, ఆ నాయకుడు అనే వాడు నాలాగా ప్రజల మధ్య నుంచే పడతాడని పేర్కొన్నాడు. దెందులూరు ఎవడబ్బ సొమ్ము కాదంటూ చింతమనేని మండిపడ్డారుు. ఎవడు పడితే వాడు వచ్చేసి నేను ఉన్నాను.. నేను వస్తాను అని చెబితే.. దెందులూరు ప్రజలేమీ అమాయకులు కాదని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed