- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారి హనీ తల్లిదండ్రులు
దిశ, డైనమిక్ బ్యూరో : గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హామీ ఇచ్చినట్లే ఆమె వైద్యానికి రూ.కోటి మంజూరు చేశారు. దీంతో ఆ చిన్నారి కోలుకుంది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతంగా ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లిదండ్రులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీకి చికిత్స అందించాలని కోరారు. ఇప్పటి వరకు తమక ఉన్నదాంట్లో అమ్మి వైద్యానికి ఖర్చు చేశామని తమ బిడ్డను కాపాడాలని వేడుకున్నారు. చిన్నారి పరిస్థితి విని సీఎం జగన్ చలించిపోయారు. హానీ చికిత్సకోసం రూ.1 కోటి మంజూరు చేశారు. అంతేకాదు చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్ కూడా అందించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో చికిత్స అందుకుంటూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్న చిన్నారి హనీని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చారు. హానీ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిసి ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా తమ పాపకు పునర్జన్మ ప్రసాదించారంటూ సీఎం వైఎస్ జగన్‌కు హానీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి హనీని సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు.
- Tags
- ys jagan