- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవాడలో అపచారం.. సోషల్ మీడియాలో దుర్గమ్మ నిజస్వరూపం దృశ్యాలు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గమ్మ ఆలయం అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పుకునే అధికారుల మాటలు వట్టివేనని తేలిపోయింది. అమ్మవారి నిజస్వరూపం దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడు రోజుల క్రితం దుర్గమ్మ ఆలయం వద్దకు ఓ మహిళా భక్తులు వెళ్లారు. ఆలయం చుట్టూ తిరుగుతూ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆలయం వెలుపల, లోపల వీడియోలను సైతం రికార్డు చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలయం అంతరాలయంలోని అమ్మవారి నిజరూపాన్ని సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో భక్తులుమండిపడుతున్నారు. దుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్ నిషేధమనే నిబంధన ఉన్నా అమ్మవారి నిజస్వరూపం దృశ్యాలు బయటకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.