- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Assembly:టీడీఆర్‌ల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే!
దిశ,గాజువాక:విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 2020-2024 ప్లాన్ మాడిఫికేషన్ చేసి టీడీఆర్ స్కామ్ కి వినియోగించారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై పల్లా మాట్లాడుతూ మాడిఫికేషన్‌ను ఆసరాగా తీసుకుని ఎక్కడైతే రెస్ట్రెక్టెడ్ జోన్స్ ఉంటాయో ఆ జోన్స్‌లో అన్నీ మార్చి వాటికి టీడిఆర్ ఇచ్చారన్నారు. అదేవిధంగా టైటిల్ డీడ్ లేని వాటికి కూడా టీడీఆర్‌లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎప్పటి నుండో ఉన్నటువంటి జాలార్ పేట వాళ్లకి ఫైల్ మూవ్ చేసి టీడీఆర్ కొట్టేద్దామని చూశారని, అదేవిధంగా విశాఖపట్నంలో సీబీసీఎన్‌సీ అనే క్రిస్టియన్ స్థలం వద్ద ఎటువంటి రోడ్డు సాధ్యపడదని తెలిసి కూడా విశాఖ మాజీ ఎంపీ ఎం వీ వీ సత్యనారాయణ కోసం మాస్టర్ ప్లాన్ లో రోడ్డు చూపించి దానికి సుమారు 62 కోట్లు టీడీఆర్ ఇచ్చారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. మధురవాడలో కూడా టీ డీ ఆర్ అక్రమాలు జరిగాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన అప్పటి పాలకులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.