రేపే కూటమి మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..!

by srinivas |   ( Updated:2024-04-29 16:23:49.0  )
రేపే కూటమి మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తున్నాయి. వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. దీంతో పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. దీంతో కూటమి మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేశారు. మూడు పార్టీల ప్రతిపాదనలో మేనిఫెస్టోను సిద్ధం చేశారు. మంగళవారం కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మొత్తం 25 అంశాలతో మేనిఫెస్టోను రెడీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అందరి చూపు కూటమి మేనిఫెస్టోపై ఉంది. ఏఏ హామీలుంటాయనే చర్చ సాగుతోంది. అయితే కూటమి మేనిఫెస్టోలో పలు అంశాలు ఉండే అవకాశం ఉందని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.

కూటమి మేనిఫెస్టోలో ఉండే అంశాలు ఇవేనంటూ ప్రచారం

1.మెగా డీఎస్సీపై తొలి సంతకం

2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000

3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000

4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500

5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం

6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు

7.రూ.3000 నిరుద్యోగ భృతి

8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000

9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ

10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి

11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000

12.ఉచిత ఇసుక

13.అన్నా క్యాంటీన్లు

14.భూ హక్కు చట్టం రద్దు

15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్

16.బీసీ రక్షణ చట్టం

17.పూర్ టూ రిచ్ పథకం

18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ

19.కరెంటు చార్జీలు పెంచం

20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్

21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం

22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం

23.పెళ్లి కానుక రూ.1,00,000/-

24.విదేశీ విద్య పథకం

25.పండుగ కానుకలు

Advertisement

Next Story