Breaking: కాసేపట్లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు విడుదల

by srinivas |
Breaking: కాసేపట్లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: మరికాసేపట్లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు విడుదల అయ్యే అవకాశం ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లు బీజేపీకి దక్కాయి. దీంతో 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల లిస్టును మాత్రం విడుదల చేయలేదు. అసెంబ్లీకి పోటీ చేసే ఆశావహులు ఎక్కువగా ఉండటంలో అభ్యర్థుల ఖరారుపై తర్జన భర్జన పడ్డారు. చివరకు పోటీ చేసే 10 మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్టును బుధవారం సాయంత్రం వరకూ విడుదల చేసే అవకాశం ఉందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ పదాధికారుల సమాశానికి తాను ఎందుకు హాజరుకాలేదనే విషయంపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. వేరే రాష్ట్రాల్లో పర్యటించడం వల్ల తాను ఆ సమావేశంలో పాల్గొనలేకపోయాయని.. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని కొట్టిపారేశారు. అన్ని పార్టీల్లో మాదిరి బీజేపీలోని సీట్ల కోసం టైట్ ఫైట్ నడుస్తోందని, బీజేపీ హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకోవడానికి అందరం సిద్ధమని సత్యకుమార్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story