- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుర్తుపై గుడ్ న్యూస్.. జనసేనకు లైన్ క్లియర్
దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీకి లైన్ క్లియర్ అయింది. ఆ పార్టీకి ఈసీ గాజు గ్లాసు గుర్తింపు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇతర అభ్యర్థులకు కూడా అదే గుర్తు కేటాయించింది. దీంతో జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇతరలకు కూడా అదే గుర్తు కేటాయిస్తే తమ ఓట్లు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం చేసింది. అంతేకాదు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అభ్యర్థులు పోటీ చేసే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు సైతం గాజు గ్లాసును కేటాయించారని, దాని వల్ల ఇబ్బందులు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు...ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో హైకోర్టులో బుధవారం ఎన్నికల సంఘం నివేదికను సమర్పించింది. జనసేన పోటీ చేసే పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించమని స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను హైకోర్టు నమోదు చేసింది. అనంతరం విచారణను మూసేశింది.