- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్‌చల్
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా క్రోసూరు మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్ చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. క్రోసూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలి(22), సిరిపురం గ్రామానికి చెందిన యువతితో పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అదే గ్రామంలో యువతితో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు అతడిని బెదిరించడంతో పాటు ఆమెను తీసుకెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతడిని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆ యువకుడు దిగనని మొండిగా ప్రవర్తించాడు. డీఎస్సీ హామీ ఇస్తే గాని కిందకి దిగనని యువకుడు చెప్పాడు.
Advertisement
Next Story