మందుబాబులకు BIG షాక్.. పెరిగిన ధరలు

by Gantepaka Srikanth |
మందుబాబులకు BIG షాక్.. పెరిగిన ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ ధరలు(Liquor Prices) 15 శాతం పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ(Excise Department) నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా చేయబోతోంది. ఇండియన్‌ మేడ్‌, ఫారిన్‌ లిక్కర్‌, బీర్‌.. ఇలా మూడు కేటగిరీలుగా సరఫరా చేయనుంది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన వేలం ద్వారా 3 వేలమంది మద్యం షాపుల్ని దక్కించుకున్నారు. మార్జిన్ 20 శాతం లభిస్తుందని భావించారు. కానీ 14 శాతమే ఇస్తుండటంతో నిర్వహణ కష్టమైపోతుందని ఆందోళన చేస్తూ వస్తున్నారు. కమీషన్ పెంచకుంటే అమ్మకాలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. దీంతో వారి డిమాండ్‌ను పరిశీలించిన ప్రభుతం ఈ మేరకు 20 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story