మద్యం అక్రమాలపై సిట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by srinivas |
మద్యం అక్రమాలపై సిట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం అక్రమాల(Alcohol Irregularities)పై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(Sit)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్‌ రాజశేఖర్(Vijayawada Police Commissioner Rajasekhar) ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ పని చేయనుంది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ మద్యం విక్రయాల్లో అవకతవకలకు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో మద్యం అక్రమాలను వెలికితీయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ బాధ్యతలను సిట్‌కు అప్పగించింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలకు సంబంధించి అవసరమైన పూర్తి సమాచారాన్ని సిట్‌కు అందించాలని ఎక్సైజ్ శాఖ(Excise Department)ను ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ చీఫ్ ద్వారా ప్రతి 15 రోజులకోసారి నివేదిక సమర్పించాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ సిట్‌లో ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బరాయుడు, అడిషినల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీ సభ్యులుగా పని చేయనున్నారు. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ మద్యంపై రూ. 90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. నగదు లావాదేవీలతో పాటు హోల్ గ్రామ్ విషయంలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు అభియోగం ఉండటంతో ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story