AP News:వారికి ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం

by Jakkula Mamatha |
AP News:వారికి ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా రాష్ట్రాన్ని వరదలు(Floods) ముంచెత్తాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంటపొలాలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అంతేకాదు వరదల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు(Original certificates) కోల్పోయిన వారికి ఉచితంగా సర్టిఫికెట్లు, రిజిస్టర్ డాక్యుమెంట్లు(Register documents), ఆధార్, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికెట్లు(Marriage certificates) పోగొట్టుకున్నా, నాశనమైనా డూప్లికేట్ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది.

Next Story

Most Viewed