ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రాష్ట్రంలోనూ అనుమతి

by srinivas |   ( Updated:2025-02-06 10:43:53.0  )
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రాష్ట్రంలోనూ అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ లభించింది. తెలంగాణలో పలువురు ఏపీ ఉద్యోగులు వైద్యం చేయించుకుని బిల్లులు రీయింబర్స్ కాక నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తెలంగాణలోనూ ఉద్యోగులు ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రకటించింది. తెలంగాణలో ఏపీ ఉద్యోగులు పలు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవల్లో భాగంగా తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆస్పత్రుల్లో వైద్యం కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు సూచించింది.

Next Story