- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..అధికారికంగా ప్రకటించిన ఎన్నికల సంఘం
X
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు నేడు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మూడేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా బరిలోకి దిగకపోవడంతో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. ఈక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ నామినేషన్ ఒక్కటే మిగిలింది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Advertisement
Next Story