- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరుస సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పవిత్ర శ్రావణ మాసం కావడం, వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఆగస్టు 15, వరలక్ష్మీ వ్రతం, మధ్యలో శనివారం, ఆ తర్వాత వెంటనే ఆదివారం, అలాగే 19న రాఖీ పౌర్ణమి ఉండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నారు. దీంతో శ్రీవారి దర్శనం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. కాగా శుక్రవారం రోజు శ్రీవారిని 62,625 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. రూ.3.63 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అలాగే ఈ రోజు, రేపు కూడా భక్తుల రద్ధీ కొనసాగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story