Breaking: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

by srinivas |   ( Updated:2023-12-14 10:23:05.0  )
Breaking: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారని మంత్రి బొత్స వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed