YS Sharmila:‘ఆ విషయంలో జగన్ బాటలోనే ప్రస్తుత సీఎం చంద్రబాబు’..వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-31 14:26:06.0  )
YS Sharmila:‘ఆ విషయంలో జగన్ బాటలోనే ప్రస్తుత సీఎం చంద్రబాబు’..వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే..ఇప్పుడు అదే బాటలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నడుస్తున్నారని షర్మిల అన్నారు.

నేడు(శనివారం) వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే అని చెప్పుకొచ్చారు. పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు. వైఎస్సార్ అమలు చేసిన ప్రతి పథకం దేశానికే ఆదర్శమన్నారు. వైఎస్సార్ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదని.. తెలుగు వారి ఆస్తి అని చెప్పారు. వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్సార్ మీద రుద్దడం సరికాదని వైఎస్ షర్మిల సూచించారు.

Advertisement

Next Story

Most Viewed