AP:రాజధాని నిర్మాణం పనులు అప్పటి నుంచే స్టార్ట్..క్లారిటీ ఇచ్చిన మంత్రి?

by Jakkula Mamatha |
AP:రాజధాని నిర్మాణం పనులు అప్పటి నుంచే స్టార్ట్..క్లారిటీ ఇచ్చిన మంత్రి?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని నిర్మాణం కోసం ఇంకా భూములు సేకరించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దాదాపు 3,550 ఎకరాలను సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ పై చంద్రబాబు సమీక్ష చేసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అందుకోసం 930 కోట్ల రూపాయలు అవసరమవుతుందని తెలిపారు. వచ్చే నెల 15వ తేదీలోగా అమరావతి రైతులకు కౌలు మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ లోపు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed