ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడమే లక్ష్యం కావాలి: ఐసీఐడీ సదస్సులో సీఎం జగన్

by Seetharam |   ( Updated:2023-11-02 07:44:20.0  )
ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడమే లక్ష్యం కావాలి: ఐసీఐడీ సదస్సులో సీఎం జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. సాగు నీటి కొరత వ్యవసాయానికి ప్రధాన సమస్యగా మారిందని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో సాగునీటి వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని వ్యాఖ్యానించారు. విశాఖలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్‌ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సదస్సును ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.‘వర్షాలు కురిసేది తక్కువ కాలమే కాబట్టి ' అని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం కావాలి. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే..ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. ఒక బేసిన్ నుంచి మరో చోటుకు నీటిని తరలించి ఉపయోగించుకోవాలి. వ్యవసాయ రంగ సమస్యలకు సదస్సులో నిపుణులు ఆమోదయోగ్య పరిష్కారాలు సూచించాలి సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు.

Advertisement

Next Story