ఏపీలో కూటమి విజయం..వాళ్లు చేసిన తప్పే మీరు చేయకండి..నటుడు సంచలన ట్వీట్!?

by Jakkula Mamatha |
ఏపీలో కూటమి విజయం..వాళ్లు చేసిన తప్పే మీరు చేయకండి..నటుడు సంచలన ట్వీట్!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందింది. ఈ క్రమంలో ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. మళ్లీ పనిలోకి దిగండి..ఏపీ సురక్షితమైన చేతుల్లో ఉంది. మీ భవిష్యత్తు పై దృష్టి పెట్టండి అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ట్రోలింగ్ మన ఉద్దేశ్యం కాదు. మంచి భవిష్యత్తు కోసం, మనం పని చేద్దాం అన్నారు. వాళ్ళు తప్పు చేస్తే మీరు మళ్లీ అదే తప్పు చేయకండి అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed