- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
దిశ, ప్రతినిధి వికారాబాద్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు, రవాణా, జాతీయ రహదారుల శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో ప్రమాద స్థలాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీ వేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించని వారిపై, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, ఆర్అండ్బీ ఇన్చార్జి ఈఈ శ్రీధర్ రెడ్డితో పాటు తాండూర్, వికారాబాద్, కొడంగల్, పరిగి డీఎస్పీలు, ఎక్సైజ్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.