ఢిల్లీలో ఏపీ శకటం సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ రూపం

by Jakkula Mamatha |   ( Updated:2025-01-24 09:40:20.0  )
ఢిల్లీలో ఏపీ శకటం సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ రూపం
X

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీలో ఈ నెల(జనవరి) 26న గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటానికి అనుమతి లభించింది. ఈ వేడుకల ప్రదర్శనకు ఏపీ ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం ఎంపికైంది. ఇవాళ(శుక్రవారం) దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను హస్తిన రోడ్లపై నిర్వహించారు. ఇందులో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇందులోనే వినాయకుడి ప్రతిమ, హరిదాసు, బొమ్మలకొలువు, చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలకు స్థానం కల్పించారు.

అనకాపల్లి దగ్గరలోని వరాహా నది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం పేరుతో ఈ బొమ్మలు ప్రసిద్ధి గాంచాయి. 2020 ఆగస్టు 30న ప్రధాని మోడీ(PM Modi) దేశీయంగా తయారయ్యే బొమ్మలను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెక్కతో తయారుచేసే ఈ బొమ్మల్లో ఎక్కడా వంపు కోణం కనపడకపోవడం విశేషం. ఏటికొప్పాక లాంటి పర్యావరణ అనుకూల బొమ్మలను ప్రోత్సహిద్దాం అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

Next Story