Breaking: కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం

by srinivas |   ( Updated:2024-06-09 14:46:47.0  )
Breaking: కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రిగా తెలుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఆయనను ప్రధాని మోడీ కేబినెట్‌లో తీసుకున్నారు. దీంతో ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి. రాష్ట్రపతి ముర్ము సమక్షంలో తొలుత ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. కొంతమంది ఎంపీలు సైతం కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్రమంత్రిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ప్రమాణం చేశారు. దేశ ప్రజల అభ్యున్నతికి పాటు పడతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

దివంగత టీడీపీ నేత, తండ్రి కింజరపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి పోటీ చేసిన తొలి సారే శ్రీకాకుళం ఎంపీ పోటీ చేశారు. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు సైతం గెలుపొందారు. శ్రీకాకుళం ఎంపీగా వరుసగా మూడుసార్లు గెలిచిన యువ నాయుడు గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ప్రధాని మోడీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పని చేసే అవకాశం లభించింది.

Advertisement

Next Story