Rajinikanth Birthday: రజినీకాంత్‌కు తెలుగు మంత్రి స్పెషల్ బర్త్ డే విషెస్

by Gantepaka Srikanth |
Rajinikanth Birthday: రజినీకాంత్‌కు తెలుగు మంత్రి స్పెషల్ బర్త్ డే విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్ర కథానాయకుడు, సూపర్ స్టా్ర్ రజినీకాంత్(Rajinikanth) ఇవాళ పుట్టి 74వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) పోస్టు పెట్టారు.

‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న సినీ నటుడు రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలలో నటించి ఆబాలగోపాలాన్ని మెప్పించిన రజినీ స్టైల్ ఆఫ్ యాక్షన్, స్వాగ్, డైలాగ్స్, మ్యానరిజమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప నటుడు. సాధారణ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ వరకు రజినీకాంత్ ఎదిగిన తీరు, వేసిన ప్రతి అడుగు ఎందరికో స్ఫూర్తి. ఏడు పదుల వయస్సులోనూ రికార్డులు తిరగరాస్తున్న రజినీకాంత్‌కు ఇకపై మరిన్ని విజయాలు చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నటుడిగా కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న రజినీకాంత్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed