- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాజీ మంత్రి సోదరుడు
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ వారంలో సీఎం జగన్ సమక్షంలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మదనపల్లిలోని శ్రీనాథ్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు శ్రీనాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ను కలిసి వైసీసీ కండువా కప్పుకోనున్నారు.
కాగా అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో వైసీపీలో చేరి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన పలమనేరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. నామినేషన్ల వేళ సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో నియోజవకవర్గంలో టీడీపీ భారీ షాక్ తగిలినట్టైంది.