ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు! అరెస్ట్ భయంతో పరార్..?

by Ramesh N |
ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు! అరెస్ట్ భయంతో పరార్..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు. భూ వివాదం కేసులో శివానంద రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మొదట నోటీసులు ఇవ్వాలని శివానంద రెడ్డి పోలీసులను కోరారట. తెలంగాణ పోలీసులు నోటీసులు తయారు చేస్తుండగానే శివానంద రెడ్డి వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయారు.

వెంటనే శివానందరెడ్డిని అడ్డుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ శివానంద రెడ్డి దొరక్కుండా తప్పించుకొని వెళ్లిపోయారట. అదే సమయంలో ఆయన అనుచరులు పోలీసులు కారు పోనివ్వకుండా గేటు వేశారని సమాచారం. కాగా, హైదరాబాద్ లోని భూవివాదం కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారని తెలియడంతో పెద్ద ఎత్తున్న శివానందరెడ్డి ఇంటికి టీపీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ సంఘటనపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story