TDP: యురేనియం తవ్వకాలపై టీడీపీ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
TDP: యురేనియం తవ్వకాలపై టీడీపీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: యురేనియం తవ్వకాలపై టీడీపీ(TDP) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిజనిర్ధారణ కమిటీని ప్రకటించింది. యురేనియం తవ్వకాలు(Uranium Mining) జరుగవు అని.. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించింది. అంతేకాదు.. సమస్యను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లారని తెలిపారు. దేవనకొండ(Devanakonda) ప్రజలు ఆందోళన చెందొద్దు అని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతం(Kappatralla forest area)లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తక్షణమే కేంద్రం తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలు ఏకమై ఈ తవ్వకాల ఉత్తర్వులు రద్దు చేసేవరకు పోరాడాలని సైతం పిలుపునిచ్చాయి.

Advertisement

Next Story