- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్నూలూ జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య
దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో అధికారం పోయిన వైసీపీ కార్యకర్తల్లో అధికార మదం పోలేదు. గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై ఎన్నోసార్లు దాడులకు పాల్పడ్డారు. హత్యలకు సైతం తెగబడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ శ్రేణులు బరి తెగింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణానికి ఒడిగట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న కోపంతో ఆ పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. దారి కాచి మరీ కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిగా గుర్తించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోకుండా బొమ్మిరెడ్డిపల్లిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.